ట్రైలర్ తోనే అరాచకం సృష్టించారు…

నవరస… ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సిరీస్ లో ఒకటి. నైన్ ఎమోషన్స్ ని తొమ్మది మంది స్టార్స్ పోట్రే చేస్తూ తెరకెక్కిన ఈ మోస్ట్ యాంటిసిపెటెడ్ యాంథాలజి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇటివలే మేకర్స్ నవరస రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ అనౌన్స్మెంట్ టీజర్ ని బయటకి వదిలారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నుంచి నవరస ట్రైలర్ బయటకి వచ్చింది. అద్భుతమైన విజువల్స్, ట్రెమండస్ మేకింగ్ ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ప్రతి కథకి ఒక స్పెషల్ ఎలిమెంట్, ఆ కథని చెప్పడానికి ఒక స్టార్, దాన్ని తెరకెక్కించిన ఒక టాలెంటెడ్ డైరెక్టర్… ఈ కాంబినేషన్ ఏ చాలా కొత్తగా అండ్ స్పెషల్ గా ఉంది. ఇంతభారి స్టార్ కాస్ట్ తో ఒక సిరీస్ తెరకేక్కడం ఇదే మొదటిసారి కావొచ్చు. ట్రైలర్ లో సూర్య, అరవింద స్వామి, సేతుపతి లుక్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి.

మణిరత్నం, జయేంద్ర ప్రెజెంట్ చేస్తున్న ఈ నవరస 9 ఎపిసోడ్స్ ని గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, గౌతం వాసుదేవ్ మీనన్, సిద్దార్థ్, ప్రకాష్ రాజ్, రేవతి, ఐశ్వర్య రాజేష్, అథర్వలు నటించారు. సిరీస్ పేరుకు తగ్గట్లే నటుల చేత నవరసాలను చూపిస్తూ మూవీ థీమ్ చూపించేలా కట్ చేసిన ఈ ట్రైలర్ అందరికీ స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఇంతమంది మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ ఒక సిరీస్ చేయడం గొప్ప విషయం అనే చెప్పాలి. కరోనా మహమ్మారి వల్ల చితికిపోయిన సినీ కార్మికులకి అండగా నిలిచేందుకు దర్శకుడు మణిరత్నం, నిర్మాత జయేంద్ర కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ లో 6వ తేదీన స్ట్రీమ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.