రామోజీ ఫిలింసిటీలో నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

NBK105
NBK105 Second Schedule Shooting Started in Ramoji Film City

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 105వ చిత్రమిది. ఇటీవ‌ల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ నేటి నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది. షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి అధ్వ‌ర్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు.

భారీ అంచ‌నాల న‌డుమ రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి, పోస్ట‌ర్స్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాశ్ రాజ్
భూమిక చావ్లా
జయసుధ
షాయాజీ షిండే
నాగినీడు
సప్తగిరి
శ్రీనివాస్‌రెడ్డి
రఘుబాబు
ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అర‌వి
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్