Nayanthara: న‌య‌న్ చేతికి ఉంగ‌రం.. లవ్ సింబ‌ల్‌తో పోస్ట్‌ చేసిన బాయ్‌ఫ్రెండ్‌!

Nayanthara: ప్ర‌ముఖ హీరోయిన్ న‌య‌న తార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళం వంటి ప‌లు భాష‌ల్లో న‌టించి సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న న‌య‌న్.. గ‌తంలో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవాతో ప్రేమ‌లో ప‌డి మోస‌పోయిన విష‌యం తెలిసిందే.. ఆ త‌ర్వాత త‌న చిన్న‌నాటి స్నేహితుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌ను కొన‌సాగిస్తుంది న‌య‌న్‌. కాగా తాజాగా ఈ హాట్ క‌పుల్ కు సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఆ ఫోటోలో ఏముంది అనుకుంటున్నారా?

ఇన్‌స్టాగ్రామ్ వేదికాగ న‌య‌న్ బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ ఫోటోను పోస్ట్ చేశారు. న‌య‌న‌తార‌ను కౌగిలించుకుని ఉన్న విఘ్నేష్‌.. ఈ ఫోటోలో వాళ్లిద్ద‌రీ ముఖాలు క‌నిపించ‌కుండా కేవ‌లం న‌య‌న్ చేతికి ఉన్న ఉంగ‌రం హైలెట్ అయ్యేలా ఆ ఫోటోను పోస్ట్ చేశాడు విఘ్నేష్‌. దీంతో వీరిద్ద‌రికీ ఎంగెజ్‌మెంట్ జ‌రిగింద‌ని.. ఈ పోస్ట్ ద్వారా అంద‌రికీ తెలియాల‌ని అనుకున్నారేమో అని కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ‌‌