సూపర్ స్టార్ టైటిల్ తో లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార 65వ సినిమా లాంచ్ అయ్యింది. నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిలింద్ రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి, వీటికి నయన్ రాకపోవడం అభిమానులని కాస్త నిరాశ పరిచి ఉంటుంది. అయితే నెట్రికన్ పేరుతో రజినీకాంత్ 1981లో ఒక సినిమా చేశాడు. ఇప్పుడు అదే టైటిల్ తో నయన్ సినిమా చేస్తుండడంతో సూపర్ స్టార్ టైటిల్ తో లేడీ సూపర్ స్టార్ సినిమా చేస్తుంది అంటూ అభిమానులు ఖుషి అవుతున్నారు.

నెట్రికన్ అంటే మూడో కన్ను అని అర్ధం, పూజ కార్యక్రమాల సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. బెయిలీ లిపిలో టైటిల్ లోగో డిజైన్ చేసి ఉండడంతో ఈ మూవీలో నయనతార బ్లైండ్ పాత్ర పోషిస్తుందని అర్ధమవుతోంది. ఇది మాత్రమే కాకుండా పోస్టర్లో రక్తం, బేడీలు, ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో వాడే వస్తువులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది క్రైం థ్రిల్లర్ కథతో తెరకెక్కే సినిమా అయి ఉండొచ్చు. వచ్చే సంక్రాతికి రానున్న నెట్రికన్ సినిమా నయన్ కెరీర్ బెస్ట్ మూవీగా ఉండేలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు.