మరోసారి నిర్మాతలుగా మారిన లవ్ బర్డ్స్

కోలీవుడ్‌లో బెస్ట్ కఫుల్స్ అనగానే హీరోయిన్ నయనతార-డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జోడీనే గుర్తుకొస్తుంది. వారిద్దరు తమ మధ్య ఉన్న మంచి కెమిస్ట్రీతో ప్రస్తుతం రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. ఇక రిలేషన్‌షిప్ పరంగానే కాదు ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి బాండింగ్ స్ట్రాంగ్‌గా ఉంది. తాజాగా వీరిద్దరు కలిసి మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయాన్ని డైరెక్టర్, నిర్మాత విఘ్నేష్ శివన్ స్వయంగా ట్వట్టర్‌లో ప్రకటించాడు.

nayanatara and vignesh shivan

పీఎస్ వినోద్ రాజ్ డైరెక్షన్‌లో రానున్న ‘కులాంగల్’ సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని విఘ్నేష్ శివన్ తెలిపాడు. నిర్మించడానికి విభిన్న స్టోరీలను నయన్ ఎంపిక చేయడాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందన్నాడు. కథ సింపుల్‌గా ఉన్నా ప్రేక్షకుల మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్నాడు. త్వరలోనే మరిన్ని డీటైల్స్‌ను వెల్లడిస్తామన్నాడు.

నయనతార ప్రధాన పాత్రలలో నటిస్తున్న రాబోయే రెండు సినిమాలు నేత్రికాన్ ,’కాతు వాకులా రెండు కదల్’ సినిమాలను విఘ్నేష్ శివన్ తన రౌడీ పిశ్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. నేత్రికాన్ సినిమాను మిలింద్ రౌ దర్శకత్వం వహిస్తుండగా.., ‘కాతు వాకులా రెండు కదల్’ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.