లేడీ సూపర్ స్టార్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్?

సౌత్ ఇండియాలో లేడీ సూపర్‌స్టార్‌ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్టార్ హీరోల అందరితో నటించి టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ మూడు ఇండస్ట్రీలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ హీరోయిన్‌గా ఒకప్పుడు నిలిచింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేస్తున్న నయనతార.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే.

NAYAN AND VIGNESH MARRIAGE
NAYAN AND VIGNESH MARRIAGE

నయనతార అనగానే.. ఆమె సినిమాలతో పాటు లవ్ ఎఫైర్స్ గుర్తుకొస్తాయి. ఆమె లవ్ ఎఫైర్స్ గురించి ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో నయనతార రిలేషన్ షిప్ పెట్టుకుంది. తొలుత శింబుతో కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్న నయన్.. ఆ తర్వాత అతడిని వదిలేసి ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వీరిద్దరు చాలా సంవత్సరాలు పాటు కలిసి ఉన్నారు. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

ఆ తర్వాత ప్రభుదేవాకు బ్రేకప్ చెప్పిన నయన్.. ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో కలిసి తిరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా.. వీరిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోలే కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ లవ్ కఫుల్స్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో తమిళనాడులోని ఒక చర్చిలో పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.