Tollywood: న‌వీన్‌చంద్ర కొత్త మూవీ షూరు..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో న‌వీన్ చంద్ర‌, స్మృతి వెంక‌ట్ జంట‌గా ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని అర‌వింద్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది. అలాగే ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టింనున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వానికి ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ గారు క్లాప్ కొట్ట‌గా.. స్ర్కిప్ట్‌ను ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ చిత్ర యూనిట్‌కు అంద‌జేశారు..

Tollywood చిత్ర ద‌ర్శ‌కుడు అర‌వింద్ మొద‌టి షాట్‌కు యాక్ష‌న్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా హీరో న‌వీన్‌చంద్ర మాట్లాడుతూ.. Tollywood ఈ చిత్ర క‌థ‌ను తొలిసారి ద‌ర్శ‌కుడు అర‌వింద్‌గారు చెప్పిన‌పుడు థ్రిల్ అనిపించింది. ప్ర‌ముఖ న‌టి మ‌ధుబాల‌గారితో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఇక ఈ చిత్రంలో ర‌ఘుబాబు, అచ్చుత్ కుమార్‌, స‌త్యం రాజేశ్‌, మీమీ గోపి, పూజా రామ‌చంద్ర‌న్‌, సుద‌ర్శ‌న్‌, న‌వీన‌రెడ్డి, సిరిశ్రీ‌, ఆద‌ర్శ్ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే Tollywood ఈ చిత్రాన్ని స‌ర్వాంత్ రామ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్‌-9గా రామాంజ‌నేయులు జ‌వ్వాజి నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్ ఈ సినిమాకు స్వ‌రాలు అందిస్తున్నారు.