ధనుష్ లాంటి హీరోలు అరుదు – నవీన్ చంద్ర

Naveen Chandra

తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర అందాల రాక్షసితోనటుడుగా ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే … ఆ తర్వాత ఎన్నోసినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నవీన్హీరోగానే చేయాలని ఫిక్స్ కాలేదు. అందుకే పాత్ర నచ్చితే విలన్ గాచేయడానికి కూడా వెనకాడ్డం లేదు. త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవలో విలన్ పాత్రలో అదరగొట్టిన నవీన్ కు ఆతర్వాత అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ఇటు హీరోగా చేస్తూనే క్యారెక్టర్ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నాడు. ఈ క్రమంలో నవీన్ ప్రతిభ కోలీవుడ్ లోనూకనిపించబోతోంది. అక్కడి స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తోన్న సినిమాలోనవీన్ చంద్ర ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు. కోలీవుడ్ లో ప్రతిష్టాత్మకనిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దురైసెంథిల్ కుమార్ దర్శకుడు.

ఇక ఈ సినిమాలో నటించడం పట్ల నవీన్ చంద్ర తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..‘‘ ధనుష్ తో నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

ధనుష్ ఓ గొప్ప నటుడు. తన పనేదో తను చూసుకుంటాడు. కూల్ అండ్ కామ్ గోయింగ్స్టార్ ఆయన. మే నెల నుంచి రెండో షెడ్యూల్ కు వెళ్లబోతున్నాం. ఈ షెడ్యూల్కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా పాత్రలోనే కాదు.. బాడీలోనూ చాలాట్రాన్స్ ఫర్మేషన్స్ ఉంటాయి. దర్శకుడు దురై సెంథిల్ కుమార్ వంటిప్రతిభావంతుడైన టెక్నీషియన్ తో పాటు ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ తోపనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు..

దురై సెంథిల్ కుమార్ గతంలో ధనుష్ తోనే కోడి(తెలుగులో ధర్మయోగిగావచ్చింది) అనే సూపర్ హిట్ సినిమా తీసి ఉన్నాడు. స్నేహ హీరోయిన్ గానటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓమ్ ప్రకాష్, పోరాట దృశ్యాలనుదిలీప్ సుబ్బరాజ్ చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాతో నవీన్ చంద్ర కోలీవుడ్ లో కూడా బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే

ఆయన ప్రతిభ తెలిసిన చాలామంది స్టార్ దర్శకులు తమ సినిమాల్లో కొత్తగాపాత్రలు క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు ఆయన పాత్రలు కూడావినిపిస్తున్నారు. కానీ నటుడుగా ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలకే ప్రాధాన్యంఇస్తానని చెబుతున్న నవీన్ చంద్ర తన ప్రతిభతో ఇతర భాషలకూ విస్తరించినాఆశ్చర్యం లేదు.