నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ నుంచి నాని సెకండ్ లుక్  

‘సరిపోదా శనివారం’ మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సూర్య అకా నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజులలో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రెజెంట్ చేస్తూ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు.

నాని ఈ పోస్టర్‌లో బాయ్- నెక్స్ట్-డోర్ అవతార్‌లో బైక్ నడుపుతూ చిరునవ్వుతో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్‌లో సూర్య కనిపించిన తీరుకు ఇది కంప్లీట్ డిఫరెంట్ గా వుంది. ఈ యూనిక్ అడ్రినలిన్‌తో నిండిన అడ్వంచర్ లో క్యారెక్టర్ కి డిఫరెంట్ షేడ్స్ వున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.  

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మురళి జి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్