నేచురల్ స్టార్ నాని చేతుల మీదగా #KJQ కింగ్ – జాకీ – క్వీన్ టీజర్ లాంచ్

సుధాకర్ చెరుకూరి నేతృత్వంలోని ప్రతిష్టాత్మక SLV సినిమాస్, అనేక బ్లాక్ బస్టర్లు , సంచలనాత్మక చిత్రాలను అందించింది. ఈ నిర్మాణ సంస్థ ప్రస్తుతం 1990ల నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామా నిర్మిస్తోంది. “#KJQ – కింగ్ జాకీ క్వీన్” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ దసరా చిత్రంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టితో పాటు శశి ఓదెల, యుక్తి తరేజ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కె.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ గ్లింప్స్ తో సంచలనాన్ని సృష్టించింది.

ఈరోజు నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన టీజర్.. ‘రాజు’ పాత్రను పోషించిన దీక్షిత్ శెట్టి చెప్పిన డైలాగ్ తో  ప్రారంభమవుతుంది: “నగరం, తుపాకీ రెండూ ఒకటే – అవి వాటిని పట్టుకున్న వ్యక్తి మాట వింటాయి.” శశి ఓదెల ‘జాకీ’ పాత్రలో పరిచయం కాగా తనది గొప్పతనాన్ని సాధించడానికి పెద్ద రిస్క్‌లు తీసుకోవడంలో నమ్మకం ఉన్న పాత్ర. యుక్తి తరేజా ‘రాణి’పాత్రలో కనిపించింది టీజర్”కత్తితో జీవించేవాడు కత్తితో చనిపోతాడు – మత్తయి 26:52.” అనే బైబిల్ నోట్ తో ముగుస్తుంది.

టీజర్ కేవలం పాత్ర పరిచయం కాకుండా,  సినిమాటోన్ ప్రిమైజ్ ని సెట్ చేస్తుంది. ఆకట్టుకునే విజువల్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ లు, ఎక్సయిటింగ్ రైటింగ్ తో  మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

దీక్షిత్ శెట్టి ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్, శశి ఓదె, యుక్తి తరేజా వారి స్క్రీన్ ప్రెజెన్స్‌తో శాశ్వత ముద్ర వేశారు. నగేష్ బానెల్ ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ,  పూర్ణచంద్ర తేజస్వి ఇంటెన్స్ మ్యూజిక్  ఈ చిత్రానికి మరోస్థాయికి తీసుకెల్తాయి. శ్రావణ్ కటికనేని ఎడిటర్,  శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దసరా తర్వాత మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. రెండేళ్ల తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. ఈ సినిమా కోసం టీమంతా చాలా ఎఫర్ట్ పెట్టాం. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగు ఆడియన్స్ నాలో ఉన్న టాలెంట్ ని అప్రిషియేట్ చేసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా టీజర్ ని లాంచ్ చేసిన నాని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు. 

హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం ఈ సినిమాలో ఇంత  మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నిర్మాత సుధాకర్ గారికి థాంక్యూ వారి నిర్మాణంలో మరెన్నో సినిమాలు చేయాలని ఉంది.  యాక్టర్స్ దీక్షిత్ శశి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు. 

హీరో శశి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. టీజర్ ని లాంచ్ చేసిన నాని గారికి థాంక్యూ. ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఇంత మంచి క్యారెక్టర్ రాసి కొత్త వాడినైనా నేను చేయగలరని నమ్మిన డైరెక్టర్ గారికి నిర్మాత గారికి థాంక్యూ.  అందరం 100% ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేసాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.

డైరెక్టర్ కేకే మాట్లాడుతూ.. థాంక్యూ ఎవ్రీబడీ. ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీరందరూ సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడుతాను. ఈవెంట్ కి వచ్చిన అందరికీ థాంక్యు సో మచ్’అన్నారు. 

డిఓపి నాగేష్ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. నేను చాలా రోజుల తర్వాత యాక్షన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. మసూద తర్వాత ఈ సినిమా వచ్చింది. పెళ్లిచూపులు సినిమాని బేస్ చేసుకుని చాలా రామ్ కామ్స్ వచ్చాయి. అలాగే మసూదని బేస్ చేసుకుని హారర్ సినిమాలు వచ్చాయి. ఇది యాక్షన్ మూవీ.ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది’అన్నారు.

తారాగణం: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్ – SLV సినిమాస్
నిర్మాత – సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం – KK
సినిమాటోగ్రఫీ – నాగేష్ బానెల్
సంగీతం – పూర్ణచంద్ర తేజస్వి
ఎడిటర్ – శ్రావణ్ కటికనేని
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీకాంత్ రామిశెట్టి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత – శేఖర్ యలమంచిలి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో