శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ కంప్లీట్

నాచురల్ స్టార్ నాని, టాక్సీవాలా ఫేమ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శ్యామ్ సింగరాయ్.. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గులు బ్యూటిఫుల్ భామలు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన నాని ఫస్ట్ లుక్, సాయి పల్లవి ఫస్ట్ లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలిపారు మేకర్స్.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ నాని న్యూ లుక్ ను రీవిల్ చేశారు నిర్మాతలు.

షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా నాని గొప్ప బృందం తో షూటింగ్ పూర్తి చేసాము మంచి ఫలితం వస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించాము అంటూ ట్వీట్ చేశారు.. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్.1 గా రూపొందుతున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యాదేవ్ జంగా కథ అందిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నులి ఈ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. మెలోడీ క్రియేటర్ మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్, సాయి పల్లవి ఫస్ట్ లుక్ అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా నాని అద్దంలో చూస్తున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.