పుష్పలో నేషనల్ క్రష్ కి ‘మేడమ్’ నుంచి గట్టి పోటినే ఉంది…

ఐకాన్ స్టార్ బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రెండు భాగాలుగా చిత్రీకరణ జరుగుతుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న మూడో సినిమా కావడంతో “పుష్ప” పై బన్నీ అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. “పుష్ప” లో చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఉర మాస్ లుక్ లో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిప్స్ లో బన్నీ, పాన్ ఇండియాని షేక్ చేశాడు. రెండు పార్టులుగా రానున్న “పుష్ప” సెకండ్ పార్ట్ లో మరో హీరోయిన్ అవసరం అయిన నేపథ్యంలో ఆ పాత్ర కోసం డైరెక్టర్ సుకుమార్ పూజా హెగ్డే ని ఫైనల్ చేశాడని టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. గతంలో అల్లు అర్జున్ తో పూజా హెగ్డే “దువ్వాడ జగన్నాథం”, “అలా వైకుంఠపురం లో” సినిమాలో నటించడం జరిగింది.

ఆ రెండిటిలో అలా వైకుంఠపురం లో సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ముచ్చటగా మూడోసారి పూజాహెగ్డే బన్నీతో “పుష్ప” సెకండ్ పార్ట్ లో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా లో చరణ్ సరసన ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే చిందులు వేయడం జరిగింది. అయితే ఈ సారి బన్నీ సరసన పుష్ప సెకండ్ భాగంలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప మూవీలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్, గ్లామరస్ హీరోయిన్ పుష్ప లోకి ఎంట్రీ ఇవ్వడం రష్మికకి పోటి ఇచ్చే అంశమే. ఈ ఇద్దరూ సెకండ్ పార్ట్ లో కలిసే కనిపిస్తారా లేక ఎవరి స్క్రీన్ స్పేస్ వారికి ఉంటుందా? ఈ ఇద్దరిలో ఎవరు హైలైట్ అవనున్నారు? లాంటి విషయాలన్ని తెలియాలి అంటే మరో రెండేళ్ళ వరకూ ఆగాల్సిందే.