ఆటలో చిచ్చరపిడుగు నటరాజ్‌ మాస్టర్‌

ఆటలో చిచ్చరపిడుగు నటరాజ్‌ మాస్టర్‌ అని నిన్న ప్రోమోలో మళ్లీ నటరాజ్ అనిపించాడు. నీతిగా ఆట ఆడేవారెవరికైనా కోపం వస్తే అలానే ఉంటుంది మరి. లోపలుండి ఆడేవారికి బయట టీంలు వేసే వేషాలు సాద్యమైనంతవరకు నాగార్జున కానీ, ఫ్యామిలీలు కానీ లీక్‌ చెయ్యకుండా ఉండాల్సింది. బిందు మాధవి పీఆర్‌ టీం ఆమెకి ఆడపులి అని జెండర్‌నికూడా వాడేస్తూ, ఆమెని తోటి కంట్స్తెంట్ లు ఏమన్నా సరే వారి పై భూతులతో విచ్చలవిడిగా కామెంట్లు పెట్టీ మరీ అటాక్ లు చేస్తున్నారు. గెలిపించుకోవటానికి అహర్నిశలు కష్టపడుతున్నారని అందరు దానికి ఇన్‌ఫ్లూయెన్స్‌ అయిపోతున్నారని లోపలి వారికి కూడా అర్థమై పోయింది. పాపం టఫ్‌గా టాస్క్‌లు ఆడే శివ, నటరాజ్‌, అరియాన, మిత్ర లాంటి వాళ్లకి ఇది రివీల్ అయినట్టుంది.ఈసారి లేడీ విన్నర్‌కే కిరీటం పెట్టాలని ముందే ఫిక్స్‌ అయిపోయినట్టు తెలిసిపోతుంది.. కానీ బాగా చదివేవాడికి తన మార్క్‌ల కంటే రెస్ట్‌లో ఉన్నాడికి వస్తున్నాయంటే ఇక్కడ సమర్థత అక్కర్లేదా అని కోపం రావటం సహజమే. ఎప్పటికైనా నిజం బయటపడక మానదు. నటరాజ్‌ మాస్టర్‌, అఖిల్‌, శివలాంటి వాళ్లకి కోపం కలగక మానదు. కానీ ఈసారి నటరాజ్‌ మాస్టర్‌ విశ్వరూపం, దశావతారం, ప్రభంజనం లాంటి పదాలకి సరిపోయే పెర్‌ఫార్మెన్స్‌ మాత్రం ప్రోమోలో చూపించాడు అనేది సత్యం.