ప్రముఖ సింగర్ కన్నుమూత

ప్రముఖ భజన గాయకుడు, సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షిణించడంతో.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. చంచల్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నరేంద్ర చంచల్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

narendra chanchal died

నరేంద్ర చంచల్ వయస్సు 80 సంవత్సరాలు. అనేక హిందీ సినిమాల్లో ఆయన పాటలు పాడారు. ఆయనను భజన్ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.