లవర్ బోయ్ ‘తరుణ్’ చేతుల మీదుగా “నరసింహపురం” లిరికల్ వీడియో విడుదల!!

బహుముఖ ప్రతిభాశాలి శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో.. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో ‘శ్రీరాజ్ బళ్ళా-టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాల’ సయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ తో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం లిరికల్ వీడియోను ఎవర్ గ్రీన్ లవర్ బోయ్ తరుణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, దర్శకులు శ్రీరాజ్ బళ్ళా, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకులు ఫ్రాంక్లిన్ సుకుమార్, ఎడిటర్ శివ.వై.ప్రసాద్, వి-ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు.

తరుణ్ మాట్లాడుతూ… “నాకు చిరకాల మిత్రుడు, క్రికెట్ కో-ప్లేయర్ నందు (నందకిశోర్) హీరోగా పరిచయమవుతున్న ‘నరసింహపురం’ ఘన విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి. ఈ తరహా చిత్రాలకిది రైట్ టైమ్. డైరెక్టర్ శ్రీరాజ్ బళ్ళా ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఫ్రాక్లిన్ సుకుమార్ కి చాలా మంచి భవిష్యత్ ఉంది” అన్నారు.


హీరో నందు మాట్లాడుతూ.. “అడిగిన వెంటనే సరే అని.. స్వయంగా వాళ్ళింట్లో మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన తరుణ్ గారికి మా యూనిట్ అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రంలో ఉన్న ఒకే ఒక డ్యూయెట్ లవర్ బోయ్ తరుణ్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకటిన్నర సంవత్సరంగా మేమంతా పడుతున్న కష్టానికి ప్రతిఫలమే “నరసింహపురం” అని అన్నారు.

సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్ మాట్లాడుతూ

.. ‘ఈ చిత్రం ద్వారా నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్న దర్శకనిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అన్నారు. ఎవర్ గ్రీన్ లవర్ బోయ్ తరుణ్ చేతుల మీదుగా “నరసింహపురం” లిరికల్ వీడియో విడుదల అవ్వడం పట్ల ఫణిరాజ్ గౌడ్, శివ వై.ప్రసాద్, చందు ఆది కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.


చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ…”హీరోగా పరిచయమవుతున్న ప్రముఖ నటుడు నందకిషోర్ కి ‘నరసింహపురం’ చాలా మంచి పేరు తెస్తుంది. అతని ప్రతిభను పూర్తి స్థాయిలో వెలికి తెచ్చే చిత్రమిది. ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం, శివ ఎడిటింగ్, చందు ఆది విజువల్ ఎఫెక్ట్స్ ‘నరసింహపురం’ చిత్రానికి ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయి. మా చిత్రం లిరికల్ వీడియో లాంచ్ చేసి, మనస్ఫూర్తిగా మెచ్చుకుని మమ్మల్ని అభినందించిన హీరో తరుణ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము” అన్నారు.


కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటర్: శివ వై.ప్రసాద్, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!