ఎమ్మెల్యేగా నారా రోహిత్?

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా BB3.విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతోంది. ఇందులో విలన్‌గా హీరో శ్రీకాంత్ నటించనున్నాడని తెలుస్తోంది.

NARA ROHIT MLA ROLE

తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో యంగ్ హీరో నారా రోహిత్ ఎమ్మెల్యే పాత్రలో నటించనున్నాడనే వార్తలు ఆసక్తికరంగా మారాయి. దాని కోసమే నారా రోహిత్ లుక్ మార్చేసి బరువు తగ్గాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నారా రోహిత్ స్లిమ్‌గా తయారైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. గత మూడేళ్లుగా నారా రోహిత్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు BB3లో ఎమ్మెల్యే రోల్ రోహిత్‌కు ఎలా కలిసోస్తుందో చూడాలి.