Natural Star Nani: ఉగాది కానుక‌గా నాని ‘ట‌క్‌జ‌గ‌దీశ్’ ట్రైల‌ర్‌..

Natural Star Nani:న్యాచుర‌ల్‌స్టార్ నాని ప్ర‌ధాన పాత్ర‌ల్లో ట‌క్ జ‌గ‌దీశ్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో నానికి జోడీగా రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేశ్ హీరోయిన్ల్‌గా న‌టిస్తుండ‌గా.. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షైన్ స్ర్కీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది.

Nani Tukjagadish

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆకట్టుకున్నాయి.. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రో అప్‌డేట్ వ‌చ్చింది.. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఉగాది పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 13న రిలీజ్ చేయ‌నున్నట్లు చిత్ర‌బృందం పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. అలాగే ఈ ట్రైల‌ర్‌ను వైజాగ్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ పోస్ట‌ర్‌లో తెలిపారు. ఇక ఈ చిత్రానికి థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.