‘ఇంకోసారి ఇంకోసారి” సాంగ్ ఫిబ్ర‌వ‌రి 13న విడుద‌ల

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘టక్ జగదీష్’. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ఇదే. ఇందులో నాని స‌ర‌స‌న నాయిక‌లుగా రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఎస్‌. త‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి ఒక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని “ఇంకోసారి ఇంకోసారి” అనే పాట లిరిక‌ల్ వీడియోను ఫిబ్ర‌వ‌రి 13 ఉద‌యం 9 గంట‌ల‌కు లాంచ్ చేస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ పాట‌‌ను చిత్రంలో నాని, రీతు వ‌ర్మ జంట‌పై చిత్రీక‌రించారు.

nani tuck jagadish song release

ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ పోస్ట‌ర్‌లో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ వైర‌ల్ అయ్యింది. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు ర‌చ‌న కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.