నిన్ను కోరి కాంబినేషన్ రిపీట్… ‘టక్ జగదీశ్’గా రానున్న నాని

నాని నటించిన నిన్ను కోరి సినిమా ప్రేమ తర్వాత ఉండే జీవితాన్ని చూపిస్తే, సామ్ చై కలిసి నటించిన మజిలీ మూవీ పెళ్లి తర్వాత ప్రేమని చూపించింది. క్లీన్ హిట్స్ గా నిలిచిన ఈ సినిమాలని అద్భుతంగా డైరెక్ట్ చేసిన ఘనత శివ నిర్వాణాకే దక్కుతుంది. సెన్సిబుల్ పాయింట్స్ ని తీసుకోని బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసే శివ నిర్వాణ, మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మొదటి సినిమా హీరోతో, శివ మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

వాయిస్: నిజానికి చాలా రోజుల నుంచి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నా కూడా ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు నాని ఏకంగా ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ ఈ మూవీని అనౌన్స్ చేశాడు. నిన్ను కోరి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రానున్న ఈ సినిమాకి టక్ జగదీశ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వినడానికే చాలా కొత్తగా ఉన్న ఈ టైటిల్ ప్రీ లుక్ పోస్టర్ లో నాని బ్యాక్ ని చూపిస్తున్న ఇన్ షర్ట్ చేసుకుంటున్నట్లు డిజైన్ చేశారు. మజిలీ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన షైన్ స్క్రీన్, నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రైతు వర్మ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.