దిల్ రాజు నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కీలక ప్రకటన చేశాడు. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అలాగే నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ‘V’సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. నాని 25వ సినిమాగా ఇది రాగా.. ఇందులో సుధీర్ బాబు కీలక పాత్రలో నటించాడు. ఇక ఇందులో నివేధా ధామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్‌గా నటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను తెరకెక్కించాడు.

dilraju

ఇందులో నాని నటన బాగానే ఉన్నా… ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు. ఓటీటీలో విడుదల చేసేటప్పుడే థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత అక్కడ కూడా రిలీజ్ చేస్తామని కండీషన్ దిల్ రాజు పెట్టాడు. ఆ కండీషన్‌తోనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ తీసుకుంది.

ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడం, ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఓటీటీలో అంతగా ఆకట్టుకోని ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు చూస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.