Tollywood: ఫిక్స్‌ ట‌క్‌జ‌గదీష్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌: నేచుర‌ల్ స్టార్ నాని

Tollywood: నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తోన్న చిత్రం ట‌క్ జ‌గ‌దీష్‌. నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బాస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శివ నిర్మాణ కాంబినేషన్‌లో వస్తున్న‘టక్‌ జగదీష్‌’పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 23న సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా ట‌క్ జ‌గ‌దీష్‌ ట్రైల‌ర్‌ను ఏప్రిల్ 13న విడ‌ద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. ‘ఈ నేప‌థ్యంలో గురువారం ట్రైల‌ర్ రిలీజ్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో.. నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘సినిమా ఫైన‌ల్ క‌ట్ చూసుకున్నాం కాబ‌ట్టి టీమ్ అందరిలో తెలియని ఓ ఎగ్జ‌యిట్మెంట్ నిండిపోయింది. ఎడిట్ రూమ్ నుంచి బ‌య‌ట‌కు రాగానే ఫంక్ష‌న్‌లో ఎలా మాట్లాడుతామో.. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో అలా మాట్లాడాను. ఫిక్సయిపో..బ్లాక్‌బస్టర్‌ అని చెప్పాను. అలాంటి ఓ ఎగ్జ‌యిట్‌మెంట్ మా అంద‌రిలో ఉంది. కెరీర్‌ పరంగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఈ ఏప్రిల్ నెల‌కు ట‌క్ జ‌గ‌దీష్ మంత్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టాం.

tukjagadish

సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చాలా కార్య‌క్ర‌మాలున్నాయి. ఈ స‌మ్మ‌ర్‌.. సినిమా ప‌రిశ్ర‌మ‌కు చాలా కీల‌కం అనే సంగ‌తి తెలుసు. అంద‌రం కోవిడ్ నుంచి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ముందుకెళుతున్నాం. ఈ ఏప్రిల్‌లో విడుద‌ల కాబోయే వ‌కీల్‌సాబ్‌, ల‌వ్‌స్టోరి, ట‌క్ జ‌గ‌దీష్‌, విరాట‌ప‌ర్వం, అలాగే రాబోయే ఆచార్య‌, నార‌ప్ప సినిమాలన్నీ పెద్ద స‌క్సెస్ అయ్యి.. ఈ స‌మ్మ‌ర్ తెలుగు ఇండ‌స్ట్రీకి స్పెష‌ల్ స‌మ్మ‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఇది మ‌న తెలుగు సినిమా, మ‌న నెటివ్ సినిమా. మ‌న మ‌ట్టి వాస‌న ఉన్న సినిమా అనేలా ఫ్లేవ‌ర్‌తో రేర్‌గా సినిమా వ‌స్తుంటుంది. ఫుల్‌ ఎమోషనల్‌ డ్రామా. మన తెలుగు సినిమా. పదిహేనేళ్ల క్రితం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో కోసం మన ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవాళ్ల‌మో అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఇచ్చే సినిమా ‘టక్‌ జగదీష్‌’. అంద‌రితో క‌లిసి ఫ‌స్ట్ డే మార్నింగ్ షో చూసే వర‌కు ఈ ఎగ్జ‌యిట్మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సినిమాలోని ఓ రా నెస్‌ను సినిమాటోగ్రాఫ‌ర్ ప్ర‌సాద్‌గారు అద్భుతంగా చిత్రీక‌రించారు. రియ‌లిస్టిక్‌గా ఉంటూ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన సినిమా ఇది. రేర్‌గా కుదిరే సినిమా. త‌మ‌న్‌తో ఎప్ప‌టి నుంచో సినిమా చేయాల‌ని అనుకుంటున్నాం. ఇప్ప‌టికీ కుదిరింది. ఈ సినిమాకు త‌నకంటే బెస్ట్ సంగీతం ఎవ‌రూ చేయ‌లేర‌న‌పించేలా మ్యూజిక్ ఇచ్చాడు. క‌థ‌లో ఎమోష‌న్స్‌ను అర్థం చేసుకుని త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. సినిమా చాలా బాగా ఉంది. ల‌డ్డులా ఉంటుంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వస్తుంది. కానీ టీజర్‌లో ఒక్క డైలాగ్‌ కూడా లేదు. ట్రైలర్‌లో మంచి డైలాగ్స్‌ ఉన్నాయి. ఉగాది పండగ సందర్భంగా మా సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్‌ 13న వైజాగ్‌లో విడుదల చేస్తున్నాం. టీజ‌ర్‌కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ సంతోషాన్ని ప్రేక్షకులకు ఇస్తుంది. అలాగే ఈ నెల 18న హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ప్లాన్‌ చేశాం. అలాగే త్వ‌ర‌లోనే ట‌క్ థీమ్ మ్యూజిక్‌ను విడుద‌ల చేసేలా కూడా ప్లాన్ చేశాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు..రెండు తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ప్ర‌మోష‌న్స్ చేయ‌బోతున్నాం. నిర్మాతలు సాహు, హరిష్‌ పెద్ది ‌ ఫుల్ స్వింగ్‌లో ప్ర‌మోష‌న్స్ ప్లాన్‌ చేస్తున్నారు’’అన్నారు.