న్యాచురల్ స్టార్ ‘నాని’ డిఫరెంట్ జోనర్ మూవీ ”శ్యామ్ సింగ రాయ్”!!

నాని వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అందులో శ్యామ్ సింగ రాయ్ ప్రేత్యేకం. టాక్సీవాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు రాహుల్ ఆలోచనలకు తగ్గట్టు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాని ఈ సినిమాలో ఒక కొత్తగా కనిపించబోతున్నాడు. నాని లుక్, డ్రెస్సింగ్ వైవిధ్యంగా ఉండబోతున్నాయి. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో నాని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న డిఫరెంట్ మూవీ ఇది. ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, క్రితి శెట్టి ఈ సినిమాలో నాని సరసన నటించబోతున్నారు.

నీహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ చిత్ర కథను సత్యదేవ్ జుంగా అందించడం జరిగింది. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటర్.

టక్ జగదీష్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యాక నాని డిసెంబర్ నుండి శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

నటీనటులు:
నాని, సాయి పల్లవి, క్రితి శెట్టి

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: రాహుల్ సంకృత్యాన్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నీహారిక ఎంటర్త్సైన్మెంట్స్
ఒరిజినల్ స్టొరీ: సత్యదేవ్ జుంగ
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జె మేయర్
కెమెరామెన్: సాను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట రత్నం (వెంకట్)
ఎడిటర్: నవీన్ నూలి
పిఆరోఓ: వంశీ శేఖర్