నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా `హిప్పీ` టీజ‌ర్ విడుద‌ల‌

hippi-teaser-launch

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా `హిప్పీ` టీజ‌ర్ విడుద‌లైంది. `RX 100` ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. ఈ చిత్రం టీజ‌ర్‌ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ “కార్తికేయ‌తో క‌లిసి `గ్యాంగ్ లీడ‌ర్‌`లో ప‌నిచేస్తున్నాను. `ఆర్ ఎక్స్ 100` గురించి ఇంత‌కు ముందు చాలా విన్నాను. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశాడ‌ని అంద‌రూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అత‌నితో క‌లిసి ప‌నిచేస్తుంటే… ఆ సినిమా ఎందుకు అంంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థ‌మైంది. కార్తికేయ‌తో ప‌నిచేయ‌డం చాలా స‌ర‌దాగా ఉంది. ఈ ప‌రిచ‌యంతోనే నేను `హిప్పీ` టీజ‌ర్‌ విడుద‌ల చేశాను. `హిప్పీ` టీజ‌ర్‌ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చాలా బావుంది. స‌క్సెస్‌ఫుల్ సినిమాకు ఉండే అన్నీ ల‌క్ష‌ణాలు, వైబ్రేష‌న్స్ ఇందులో ఉన్నాయి. సినిమా చాలా బావుంటుంద‌నిపిస్తోంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ స‌మ్మ‌ర్‌లో త‌ప్ప‌కుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుందని న‌మ్ముతున్నా“ అని అన్నారు.

కార్తికేయ మాట్లాడుతూ “నాని సార్‌తో ప‌నిచేసే ఛాన్స్ నాకు `గ్యాంగ్‌లీడ‌ర్‌` చిత్రంతో వ‌చ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజ‌ర్ లాంచ్ ఆయ‌న చేతుల మీదుగా జ‌రిపించాల‌ని అనుకున్నా. నేను అడ‌గ్గానే అంగీక‌రించారు. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. `నేను అడ్వాంటేజ్ తీసుకోవ‌ట్లేదు క‌దా సార్‌` అని అన్నా. `నువ్వు అడ‌క్క‌పోయినా చేసేవాడిని` అని నాని సార్ అన్నారు. అంత మంచి వ్య‌క్తి ఆయ‌న . షూటింగ్ చేస్తున్న‌ప్పుడే ఆయ‌న బాగా క్లోజ్ అయ్యారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక `నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియ‌దు` అని అనుకుంటున్న త‌రుణంలో నాని గారితో ఈ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌గ‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో ఈ జ‌ర్నీ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నా“ అని అన్నారు.


ద‌ర్శ‌కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ “మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసినందుకు నాని సార్‌కు చాలా ధ‌న్య‌వాదాలు. ఆయ‌న‌తో పాటు నేను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌గారికి ధ‌న్య‌వాదాలు చెప్పాలి. విక్ర‌మ్‌గారి షూటింగ్‌లో ఉండ‌గానే మేం నానిగారితో టీజ‌ర్ విడుద‌ల చేయించాం“ అని అన్నారు.
విక్ర‌మ్‌.కె.కుమార్ మాట్లాడుతూ “కార్తికేయ‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాకు మంచి స్నేహితుడు. టీజ‌ర్ చూస్తుంటే మంచి ఫ‌న్ రైడ్‌లా అనిపిస్తోంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాలి. మంచి టీమ్ క‌లిసి చేసిన చిత్ర‌మిది“ అని తెలిపారు.

నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ “రెండు పాట‌లు మినహా షూటింగ్ పూర్త‌యింది. ఒక పాట‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో, ఒక పాట‌ను ప‌బ్బులో చిత్రీక‌రిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు ఈ షూటింగ్ ఉంటుంది. టీజ‌ర్ చాలా బావుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌రీతిలో నిర్మిస్తున్నాం. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం“ అని చెప్పారు.

నటీనటులు:
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్ , బ్రహ్మాజీ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్