గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే కలెక్షన్స్…

నాచురల్ స్టార్ నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఐదుగురు ఆడవాళ్లు, వారి మధ్యలో పెన్సిల్ పార్థసారథిగా నాని చేసిన హడావుడి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ కే కుమార్ తన టేకింగ్ తో సినిమాని హై స్టాండర్డ్స్ కి తీసుకెళ్లాడట. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో గ్యాంగ్ లీడర్ తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ 4.51 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి గ్యాంగ్ లీడర్ మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
గ్యాంగ్ లీడర్ ఏరియా వైజ్ ఫస్ట్ డే షేర్

నైజాం – 1.67
సీడెడ్ – 0.51
నెల్లూరు – 0.15
కృష్ణా – 0.33
గుంటూరు – 0.46
వైజాగ్ – 0.61
ఈస్ట్ – 0.52
వెస్ట్ – 0.26
ఏపీ + తెలంగాణ = 4.51 కోట్లు