నానికి డ్యూయల్ రోల్ కలిసొస్తుందా?

నేచురల్ స్టార్ నాని బ్రేక్ లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా చేస్తుండగా.. దీని షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. శివ నిర్వాణ దీనిని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ షూటింగ్‌లో నాని పాల్గొననున్నాడు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభం కానుండగా.. సాయిపల్లవి, కృతిశెట్టి నాని సరసన హీరోయిన్స్‌గా నటించనున్నారు. ఇందులో నాని ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.

ముందుగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. కాని అనివార్య కారణాల వల్ల ఆ బ్యానర్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో మాట్లాడాడి… ప్రాజెక్ట్ సెట్ చేసారు.