భారీగా రాబట్టాలి నాని…

జెర్సీ సినిమా రిజల్ట్ ని మర్చిపోక ముందే నాని గ్యాంగ్ లీడర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ సెప్టెంబర్ 13న విడుదల కానున్న గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు. గ్యాంగ్ లీడర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 28.20 కోట్లకి జరిగింది, ఈ సినిమా సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరాలి అంటే మినిమమ్ 40 కోట్ల వరకూ రాబట్టాలి.

ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాపై ఉన్న హైప్ కి పాజిటివ్ టాక్ తోడైతే ఆ మొత్తం రావడం పెద్ద కష్టమేమి కాదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న నాని, గ్యాంగ్ లీడర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి తన మార్కెట్ పరిధిని పెంచుకోవాలని చూస్తున్నాడు. సినిమా ప్రొమోషన్స్ ని కూడా అన్నీ తానే అయి ముందుండి నడిపిస్తున్న నాని అనుకుంటున్న టార్గెట్ ని గ్యాంగ్ లీడర్ సినిమా ఎంత వరకూ అందుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే రీసెంట్ గా వైజాగ్ లో గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది, ఈ సందర్భంగా మాట్లాడిన నాని… అష్టాచమ్మా ప్రీమియర్ ని మొదటిసారి వైజాగ్ లోనే వేశామని అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పుకొచ్చాడు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. మరి నాని సంతోషాన్ని గ్యాంగ్ లీడర్ రిజల్ట్ మరింత పెంచుతుందేమో చూద్దాం.