మోక్షజ్ఞ సేవా సంఘం రక్తదానం

బాలయ్య బాబు 61వ జన్మదినం సందర్బంగా ఒకరోజు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ… నందమూరి తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం తలస్సేమియా పిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం రక్తదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులు ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారని, అయితే ఈ కోవిడ్ విపత్కర సమయంలో కూడా రక్తదాన సేవలు ఎక్కువుగా నిర్వహిస్తునందుకు గాను రెడ్ క్రాస్ అధినేత జగన్మోహనరావుగారు సేవా సంఘంను మూమెంటో తో అభినందించడం జరిగింది. కాగా కరోనా నేపథ్యంలో అభిమానులు ఎవరు ఘనంగా వేడుకలు చేయవద్దని, అందరూ క్షేమంగా ఉండాలని… అదే తనకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని బాలకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారు.