నందమూరి చైతన్య కృష్ణ పెళ్లిలో సందడే సందడి

తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడైన చైతన్య కృష్ణ పెళ్లి నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రేఖారాణి అనే ఆవిడని చైతన్య కృష్ణ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, హీరో కల్యాణ్ రామ్, బాలయ్య రెండో అల్లుడు శ్రీ భరత్ దంపతులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

NANDAMURI KRISHNA CHAITANYA

ఇక పలువురు ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారని తెలుస్తోంది. బాలయ్య దగ్గర ఉండి తన అన్న కొడుకు అయిన చైతన్య కృష్ణ పెళ్లిని జరిపించారు. పెళ్లి పనులను మొత్తం బాలయ్య చూసుకున్నారు. ఎంగేజ్‌మెంట్ దగ్గర నుంచి పెళ్లి పనుల వరకు అన్నీ బాలయ్య దగ్గర ఉండి చూసుకున్నారు. ఇక పెళ్లిలో కూడా బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గతంలో చైతన్య కృష్ణ తెలుగులో ఒక సినిమాలో నటించారు. జగపతి బాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో చైతన్య మరో హీరోగా నటించారు. ఆ సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన చైతన్య కృష్ణ.. బిజినెస్‌లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పలు బిజినెస్‌లలో రాణిస్తున్నారు.