
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రీ-టీజర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయశాంతి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన అర్జున్ S/O వైజయంతి’ ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు నిర్మించారు.ఈ చిత్ర టీజర్ ని మేకర్స్ లాంచ్ చేశారు.
ఐపీఎస్ ఆఫీసర్ విజయశాంతి విధి నిర్వహణలో నేరస్థులపై కాల్పులు జరపడంతో టీజర్ ప్రారంభమవుతుంది. చావుకి ఎదురెళ్ళిన ప్రతిసారి ఆమెకు కొడుకు అర్జున్ ముఖం గుర్తుకు వస్తుంది. వైజాగ్‌లో నేరస్థులని నియంత్రించడంలో పోలీసులు, కోర్టులు రెండూ విఫలమైనప్పుడు, అర్జున్ పరిస్థితని తన చేతుల్లోకి తీసుకుంటాడు. చట్టాన్ని ధిక్కరించే ఎవరినీ శిక్షించకుండా ఉండనివ్వనని విజయశాంతి చెప్పడం, అర్జున్ అమ్మకు బర్త్ డే విషెష్ చెప్పడంతో టీజర్ ఎండ్ అవ్వడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
అర్జున్ S/O వైజయంతిలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి యాక్షన్, డ్రామా, భావోద్వేగాలను అద్భుతంగా బ్లెండ్ చేశాడు. మదర్ డ్యూటీ, కొడుకు కోపం, మంచి, చెడుల మధ్య ఒక ఎపిక్ స్టొరీగా ప్రెజంట్ చేశాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు తన మోస్ట్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఆంధించాడు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడు. విజయశాంతి కంబ్యాక్ గొప్పగా వుంది. ఆమె తన పాత్ర ఇంటెన్స్ ను, తల్లి యొక్క లోతైన భావోద్వేగాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకోచాహ్రు. వారి కెమిస్ట్రీ నెరేటివ్ కి డెప్త్ అండ్ ఇంపాక్ట్ ని యాడ్ చేస్తోంది.
ఈ టీజర్ ఈ రెండు ప్రధాన పాత్రలని స్ట్రాంగ్ ఇంపాక్ట్ త ప్రెజెంట్ చేసింది. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమా బ్యాక్ డ్రాప్ ని హైలైట్ చేస్తుంది. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ పవర్ ఫుల్ నేపథ్య సంగీతంతో కథనాన్ని మరింతగా పెంచారు. తమ్మిరాజు ఎడిటర్, స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా అందించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఫ్రేమ్ లో గ్రాండియర్ కనిపించింది. మొత్తంమీద, టీజర్ వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు మేకర్స్.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో లేడి సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈ కథ నాకు చాలా నచ్చింది. కళ్యాణ్ రామ్ నిజంగానే రాముడు లాంటి బాలుడు. తనకి చాలా మంచి మనసుంది. చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. ఎక్కడా ఇబ్బంది కలిగించకుండా సినిమా త్రూ అవుట్ కేర్ తీసుకున్నారు. ఈ సినిమాతో నాకు బాబుకి చాలా చక్కటి బాండ్ ఏర్పడింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఒక యాక్షన్ సినిమా చేయమని చాలామంది కోరారు. ఈ సినిమాలో అలాంటి యాక్షన్ కుదిరింది. నా అభిమానులకి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ దొరుకుతుందని భావిస్తున్నాను. చాలా రోజుల తర్వాత యాక్షన్ చేశాను. నేను యాక్షన్ ఎలా చేస్తానో అని యూనిట్ లో కొంత టెన్షన్ పడ్డారు. అయితే యాక్షన్ చెప్పిన వెంటనే అలా నేచురల్ గా చేసేసాను . నిజంగా ఇప్పుడు నేను చేయగలుగుతానని వాళ్లు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఎప్పుడూ విజయశాంతినే. అదే పౌరుషం అదే రోషం. తగ్గేదేలే. ఎంత ఏజైనా ఇలానే స్ట్రాంగ్ గా ఉంటాను. క్రమశిక్షణగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. నిర్మాతలు ఖర్చుకి వెనకాడకుండా ఈ ఎంత కావాలంటే అంత పెట్టారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ లా అనిపించలేదు. చాలా కూల్ గా ఉన్నారు. ఈ సినిమా తర్వాత టాప్ డైరెక్టర్ అవుతారు. కళ్యాణ్ రామ్ కి సినిమా అంటే చాలా ఫ్యాషన్. రామారావు గారు నేర్పించిన డెడికేషన్ సిన్సియారిటీ ఇది. ఈ జనరేషన్ లో కూడా బాబు ఇలా ఉండడం నాకే షాక్ అనిపించింది. బాబు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ముఖ్యంగా క్లైమాక్స్ చూసి షాక్ అయిపోతారు. మామూలుగా ఉండదు. ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుంది. డెఫినెట్ మీకు నచ్చుతుంది. సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేయండి’అన్నారు
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ (విజయశాంతి) చేసిన కర్తవ్యం సినిమాని ఎవరు మర్చిపోలేం.ఈ సినిమా కథని డైరెక్టర్ ప్రదీప్ చెప్తుంటే కర్తవ్యం సినిమాలో వైజయంతి క్యారెక్టర్ కి కొడుకు పుడితే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనేది ఈ కథ అన్నారు. అయితే అమ్మ ఒప్పుకుంటేనా ఈ సినిమా చేద్దామని అన్నాను. ఈ సినిమా మెయిన్ పిల్లర్ అమ్మ. ఈ వయసులో కూడా అమ్మ ఎలాంటి డూప్ లేకుండా అద్భుతమైనటువంటి స్టన్స్ చేశారు. పృథ్వి గారు చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశారు. యానిమల్ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో, తెలుగులో ఈ సినిమా అంతా గుర్తింపు తెస్తుందని ఆయన మొదటి రోజు నుంచి చెప్పారు. ఈ సినిమాకి ఆయనే డబ్బింగ్ చెప్పారు. మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా పాజిటివ్ యాటిట్యూడ్ తో చేయడం జరిగింది. అతడు ఒక్కడే సినిమా ఎప్పటికీ గుర్తుంది. ఈ సినిమా కూడా మరో 20 ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది. ప్రదీప్ ఈ సినిమాతో చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ కాబోతున్నాడు. ఒక అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అలాంటి స్త్రీమూర్తులని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసిన సరిపోదు. అదే అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ కథలో చాలా సిన్సియారిటీ ఉంది. చాలా ఎమోషన్ ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అమ్మతో వర్క్ చేయడం మర్చిపోలేను. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక తల్లి బిడ్డ మధ్య ఎంత సిన్సియర్ ఎమోషన్ ఉంటుందో ఈ సినిమా కూడా అంతే నిజాయితీగా ఉంటుంది’అన్నారు
యాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడిప్పుడే మంచి టైం వచ్చింది. యానిమల్ తర్వాత లైఫ్ మారింది. ఇప్పటివరకు దాదాపుగా 300 సినిమాలు చేశాను. ఎన్నో వెరైటీ క్యారెక్టర్స్ చేశాను. నా కెరియర్లో ఇప్పటివరకు ద బెస్ట్ మోస్ట్, డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలోనిదే. సినిమాని చాలా పాషన్ తో చేశాం. సినిమా డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు
డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం .ఈ కథ కళ్యాణ్ రామ్ గారికి చెప్పినప్పుడు కథ బాగుంది మేడం(విజయశాంతి) గారు ఒప్పుకుంటేనే చేద్దామని అన్నారు. మేడం గారు యాక్సెప్ట్ చేయడంతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. కళ్యాణ్ గారికి, మేడమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. మా డైరెక్షన్ టీం కి థాంక్యూ అందరూ చాలా సపోర్ట్ చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారు, మ్యూజిక్ అజినీష్ గారు, డిఓపి రాంప్రసాద్ గారు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు.
ప్రొడ్యూసర్ సునీల్ బలుసు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాని మేడం గారు ఒప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి మేడం గారు బ్యాక్ బోన్. మేడం గారు లేకపోతే ఈ ఫిలిం ఈ స్కేల్లో అయ్యేది కాదు. కళ్యాణ్ రామ్ గారు మాకు ఫ్యామిలీ. లీడర్ లా ముందుకు తీసుకెళ్ళారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’అన్నారు
రైటర్ శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ ని అర్జున్ విశ్వనాథ్ కంటి సైగలు శాసిస్తాయి. ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి థాంక్ యూ. డైరెక్టర్ ప్రదీప్, ప్రొడ్యూసర్స్ అశోక్ గారు సునీల్ గారికి టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. విజయశాంతి గారి సినిమాకి వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమాకి డ్రైవింగ్ ఫోర్స్ మా హీరో కళ్యాణ్ రామ్ గారు. ఆయన కమిట్మెంట్మెంట్ మా అందరినీ ముందుకు నడిపించారు. అందరికీ థాంక్యు’అన్నారు.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
పీఆర్వో: వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో