కళ్యాణ్ రామ్ ఎంట్రీ… వార్ వన్ సైడ్ చేయడానికేనా?

మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్… ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఒకేఒక్క హాట్ టాపిక్. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఎవరిని గెలికినా, ఏ నలుగురు ఒక చోట మాట్లాడుకుంటున్నా ఆ చర్చ మా ఎన్నికల గురించే. రెండేళ్ళకి ఒకసారి జరిగే ఈ అధ్యక్ష పదివి ఎన్నికల్లో ఈసారి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో పోటి చేస్తుండగా, అతనికి పోటిగా మంచు విష్ణు బరిలోకి దిగాడు. మోహన్ బాబు అండతో ఇండస్ట్రీని కదిలించే పనిలో ఉన్న విష్ణు, ప్రకాష్ రాజ్ కి చెక్ పెట్టే పనిలో పడ్డాడు. ఈ ఇద్దరి మధ్యలోకి హేమ కూడా వచ్చి ఎన్నికల్లో నిలబడుతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఈ త్రిముఖ పోరులోకి జీవిత రాజశేఖర్ కూడా పోటిలోకి వస్తుంది అనే వార్త వినిపిస్తుంది.

ఈ నలుగురి మధ్య ఫైట్ ఎలా ఉంటుంది అనే డైలమాని మరింత పెంచుతూ అధ్యక్ష ఎన్నికల్లోకి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా వస్తున్నాడు అనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. మెగా నందమూరి ఫ్యామిలీస్ మధ్య ఫైట్ అంటే అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా రసవత్తరంగా ఉండబోతోంది. కళ్యాణ్ రామ్ వస్తే అతనికి అండగా బాబాయ్ బాలకృష్ణ వస్తాడు… ఇక వార్ వన్ సైడ్ అవడం గ్యారెంటి అంటూ ఎవరికి తోచిన వార్తలు వాళ్లు రాయడం మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ మా అధ్యక్ష ఎన్నికల్లో పోటి చెయ్యట్లేదు అనేది వాస్తవం. అది ఒక రూమర్ మాత్రమే. ఈ పుకారుని ఎవరు పుట్టించారో తెలియదు కానీ కళ్యాణ్ రామ్ అయితే పోటి చెయ్యట్లేదు. ఇప్పటికైనా ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడితే చాలు.