కళ్యాణ్ రామ్ జోష్ మాములుగా లేదుగా

నందమూరి కళ్యాణ్ రామ్… హీరో అండ్ ప్రొడ్యూసర్ అయిన ఈ నందమూరి కుర్రాడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని, ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇచ్చే సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే కళ్యాణ్ రామ్, సినిమా సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ రూల్ నే ఫాలో అవుతూ వచ్చిన కళ్యాణ్ రామ్, తన బర్త్ డే సందర్భంగా మూడు సినిమాలని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది నుంచి ట్రెండ్ మార్చాలి అనుకున్నాడో ఏమో కానీ కళ్యాణ్ రామ్, అనౌన్స్ చేసిన మూడు ప్రాజెక్ట్స్ కూడా పెద్ద బ్యానర్స్ లోనే కావడం విశేషం.

ప్రస్తుతం బింబిసారా సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఒక మూవీని అనౌన్స్ చేశాడు. ఇది కూడా పీరియాడిక్ డ్రామా అనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఈరోజు సాయంత్రం 04:05 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ఫస్ట్ లుక్ తో తెలియనున్నాయి. కేవీ గుహన్ తో కలిసి 118 లాంటి కమర్షియల్ థ్రిల్లింగ్ హిట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్, ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ క్రైమ్ డ్రామాని డీల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు కన్ఫర్మేషన్ ఇస్తూ ట్వీట్ చేశాడు. ఈ రెండు కొత్త ప్రాజెక్ట్స్ తో కళ్యాణ్ రామ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాని చేయడానికి రెడీ అయ్యాడు. రాజేందర్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ఏ జానర్ లో రాబోతుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఇప్పటికి అయితే తన పంథా మార్చుకుంటూ కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తున్నాడు. హీరోగా బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్, తమ్ముడు యంగ్ టైగర్ చేయబోయే సినిమాలని ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్, ఇలాంటి బర్త్ డేస్ మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ. హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ రామ్ ఫ్రమ్ టీం TFPC