28 ఏళ్ల తర్వాత ఆదిత్య 369కి సీక్వెల్ చేస్తున్న నందమూరి వారసుడు

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎంత మంచివాడవురా’. సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఎంత మంచి వాడవురా రిలీజ్ అవగానే, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 118తో కళ్యాణ్ రామ్ కి థ్రిల్లింగ్ హిట్ ఇచ్చిన కేవీ గుహన్ కి మరోసారి ఈ నందమూరి హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికన్నా ముందు కళ్యాణ్ రామ్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

వేణు మల్లిడి అనే కొత్త దర్శకుడు చెప్పన సైన్స్ ఫిక్షన్ లైన్ నచ్చడంతో ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఐదు వందల సంవత్సరాలు వెనక్కి, ఐదు వందల సంవత్సరాల భవిష్యత్‌ కి వెళ్లే కొత్త నేపధ్యం ఉన్న కథ కావడంతోనే కళ్యాణ్ రామ్ ఓకే చెసాడని సమాచారం. సరిగ్గా ఇలాంటి కథతోనే బాబాయ్ బాలకృష్ణ, ఆదిత్య 369 అనే సినిమా చేశాడు. తెలుగు ఆల్ టైం బెస్ట్ మూవీస్ అనే లిస్ట్ తీస్తే, అందులో ఆదిత్య 369 తప్పకుండా ఉంటుంది. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్, ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఓకే చెప్పిన మూవీ కూడా ఇలాంటి కథనే కావడంతో… బాబాయ్ సినిమాకి అబ్బాయ్ సీక్వెల్ చేస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాలు డిస్కస్ చేసుకుంటున్నాయి.