బాబాయ్ కూడా ఉంటే బాగుండేది…

ప్రస్తుతం కరోనా కారణంగా ఏ పనీ అనుకున్నట్లు అవ్వట్లేదు అలా అని పనులు ఆపుకోని కూర్చోలేము. ఎంత దూరంగా ఉందాం అనుకున్నా కూడా మాత్రం చేసుకోక తప్పట్లేదు. ముఖ్యంగా ముహూర్తం ఫిక్స్ చేసుకోని అందరి మధ్య చేసుకోవాలి అనుకున్న శుభకార్యాలు అన్నీ వాయిదా వేసుకోవడమో లేక తక్కువ మంది మధ్య చేసుకోవడమో జరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమానికి మన అనుకున్న వాళ్లు లేకపోవడం లోటే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఫీలింగ్ లోనే ఉండి ఉంటాడు. తారక్ కరోనా కారణంగా తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని అభిమానులను కోరిన విషయం తెలిసిందే. తారక్ చెప్పినట్టుగా అభిమానులు ఎవ్వరు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరపలేదు. అయితే తాజగా ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా కానిచేశారట. ఎన్టీఆర్ చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించారు. బాగా దెగ్గర మనుషుల మధ్య ఇంట్లో వాళ్ళతోనే ఎన్టీఆర్ ఈ కార్యక్రమం పూర్తి చేయించాడట. శాస్త్త్రోత్తంగా జరిగిన ఈ అక్షరాభ్యాస వేడుకకి నందమూరి బాలయ్య వెల్లలేకపోవడం ఎన్టీఆర్ కి పెద్ద లోటుగా అనిపించి ఉండొచ్చు. హరికృష్ణ మరణం తర్వాత బాబాయ్ బాలయ్యే ఎన్టీఆర్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఆయన కూడా ఈ వేడుకకి వెళ్లి ఉంటే అందరూ కలిసే వాళ్ళు. ఈ కరోనా పుణ్యమాని ఎవరూ కలవలేకపోతున్నారు.