పద్మభూషణ్ అవార్డు పై స్పందించిన నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ అనే పేరు వింటే మనకు గుర్తుకు వచ్చేది నటుడిగా ఆయన చేసిన సినిమాలు మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గానికి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఒక ప్రజా నాయకుడిగా కూడా గుర్తొస్తారు. అయితే ఇటీవలే హిందూపురంలోని వైసీపీకి చెందిన కౌన్సిలర్స్ వారి పార్టీలో విసుగు చెంది టిడిపిలో చేరడం జరిగింది. అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి కూడా టిడిపికి కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా హిందూపురంలో కూటుంబ ప్రభుత్వం వచ్చాక నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. అయితే దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ పద్మభూషణ్ రావడం తనలో ఎంతో కసి పెంచిందని ఇకపై మరింత ఉత్సాహంగా తను నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడతానని తెలిపారు. తనకు ఈ విషయంలో ఎవరు పోటీ కాదని, తనకు తానే పోటీ అని బాలకృష్ణ అన్నారు. అంతేకాక తన తండ్రి ఎన్టీఆర్ గారికి భారతరత్న తప్పకుండా వస్తుందని అన్నారు.