ప్రముఖ దర్శకులు తాతినేని రామారావు మృతి పట్ల సంతాపం తెలిపిన నందమూరి బాలకృష్ణ

దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన దర్శకులు తాతినేని రామారావు గారు ఈరోజు మనమధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. తాతినేని రామారావు గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది. తాతినేని రామారావు గారు అద్భుతమైన దర్శకులు. నాన్నగారితో చరిత్రలో నిలిచిపోయే ‘యమగోల’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన ‘తల్లితండ్రులు’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అభిమాన చిత్రంగా నిలిచింది. నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని ఆలోచిస్తూ, అదే సమయంలో సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు గారి సొంతం. బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాతినేని రామారావు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను

మీ నందమూరి బాలకృష్ణ