తమన్ కు బాలయ్య సర్ప్రైజ్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్ ఎస్ తమన్ సంగీత దర్శకుడిగా వచ్చిన చిత్రాలు అంటే హిట్ కాంబినేషన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పటికే అనేక బాలకృష్ణ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన తమన్ తన మాస్ బీట్ లతో ఫ్యాన్స్ ను 100% మెప్పించడం జరిగింది. అంతేకాక బాలకృష్ణ తదుపరి సినిమాలకు కూడా తమ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది రౌండ్ గా ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ తమన్ ను నందమూరి తమన్ అంటూ పిలవడం జరిగింది. ఆ మాటతో అభిమానులు అంతా కేరింతలు కొడుతూ అప్పటినుండి సంగీత దర్శకుడు తమన్ ను నందమూరి తమన్ అంటూ పిలవడం మొదలుపెట్టారు. అంతేకాక ఆ తరువాత ఎన్టీఆర్ ట్రస్ట్ కు సంబంధించి ఒక ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు తమన్ ను తన సోదరుడు బాలకృష్ణ పెట్టిన పేరుతో నందమూరి తమన్ అని పిలిచారు. దీనితో అందరికీ అర్థమై ఉంటుంది నందమూరి బాలకృష్ణ గారికి తమన్ అంటే ఎంత ప్రత్యేకం అని.

ఇది ఇలా ఉండగా బాలకృష్ణ తమన్ కు ఒక సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓ కొత్త పోర్స్చే కారును తమనుకు బహుమానంగా ఇచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.