Nagarjuna: వైల్డ్‌డాగ్ చిత్రానికి సెన్సార్ ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చిందో తెలుసా..

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం వైల్డ్‌డాగ్. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తుండ‌గా..

Wild dog

స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుంది. ఇందులో నాగ్ ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా క‌నిపించ‌నున్నారు.. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప‌లు వాస్త‌వ సంఘ‌ట‌నల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా.. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని U/A స‌ర్టిఫికేట్ పొందింది. ఇక చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ స్వ‌రాలు అందించారు.