Nagarjuna: నాగార్జున కొత్త చిత్రం షురూ..

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. పిఎస్‌వి గ‌రుడ‌వేగ చిత్రంతో విజ‌యం ద‌క్కించుకున్న డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్‌స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది.

nag New movie

ఈ సంద‌ర్భంగా Nagarjuna నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమా క‌థ ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌.. చాలా రోజుల త‌ర్వాత ఇలాంటి రేంజ్ ఉన్న యాక్ష‌న్ మూవీలో న‌టిస్తున్నాను. డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్‌స‌త్తారు చెప్పిన క‌థ నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేయ‌డంతో ఈ సినిమాకు వెంట‌నే ఓకే చెప్పాను అని అన్నారు. ఇక ఇదిలా ఉంచితే.. ప్ర‌స్తుతం నాగార్జున న‌టించిన బాలీవుడ్ తాజా మూవీ బ్ర‌హ్మాస్త్ర. ఈ సినిమాలో Nagarjuna నాగార్జునకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు చిత్ర‌బృందం.‌