బిగ్ బాస్ కి సంబంధించిన మరో స్పెషల్ అప్డేట్ వచ్చింది. గత కొంత కాలంగా షోపై వస్తున్న రూమర్స్ కి మెల్లమెల్లగా ఎండ్ కార్డ్స్ పడుతున్నాయి. ఇటీవల బిగ్ బాస్ 4 హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అని ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అఫీషియల్ గా మొదటి స్టైలిష్ లుక్ ని రిలీజ్ చేశారు.
బిగ్ బాస్ 4 టైటిల్ తో నాగార్జున ఇచ్చిన స్టిల్ అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మన్మథుడు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి నాగార్జున 60ఏళ్ళ వయసులో కూడా తన స్మార్ట్ నెస్ ని చూపించాడు. కరోనా కాలంలో ఆయన ఇంతగా రిస్క్ చేస్తున్నారు అంటే బలమైన జాగ్రత్తలు తీసుకొని ఉంటారని తెలుస్తోంది.
ఇక ఫోటో షాట్ అయిపోగా నెక్స్ట్ ప్రోమోను వదలబోతున్నారు. ప్రోమో షూట్ కి కేవలం 10 నుంచి 15మంది మాత్రమే వర్క్ చేసినట్లు సమాచారం. సాధారణంగా ఒక ప్రోమో కోసం దాదాపు 40 మంది అవసరం ఉంటుంది. కానీ ఈ సారి అతి తక్కువ మంది పాల్గొనడం చూస్తుంటే నిర్వాహకులు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక బిగ్ బాస్ మొదటి మూడు సీజన్స్ లలో సినిమా ప్రమోషన్స్ గట్టిగానే నడిచాయి. కానీ ఈ సారి అవి కూడా ఉండేలా కనిపించడం లేదు.
షోను ఇదే నెల చివరలో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 15మంది కంటెస్టెంట్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక కరోనా వైరస్ రాకుండా ముందుగానే కంటెస్టెంట్స్ ని క్వారంటైన్ లో ఉంచనున్నట్లు టాక్. అలాగే బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టబోయే ముందు కూడా కరోనా పరీక్షలు నిర్వహించున్నారు. మరి ఈ సారి బిగ్ బాస్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.