తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విదంగా వరదలు భాగ్యనగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇక ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సిద్ధమవుతోంది. హీరో అక్కినేని నాగార్జున కూడా సీఎంఓ సహాయనిదికి విరాలన్నీ ప్రకటించారు.
భారీ వర్షాలు మరియు వరదలు హైదరాబాద్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయి. తక్షణ ఉపశమనం కోసం 550 కోట్లు విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నాము. ఇక అందుకు మద్దతుగా నిలబడి తాము తెలంగాణ సిఎం సహాయ నిధికి 50 లక్షలు సమకూరుస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణ సిఎంఓకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇక మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా సహాయం చేసేందుకు ముందుకు రావాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు.