క్షమాపణలు చెప్పిన నాగార్జున – అసలు ఏం జరిగింది?

సామాన్యంగా సినిమా సెలెబ్రిటీలు కనిపిస్తే అందరు ఫోటో తీసుకోవడానికి, కలవడానికి, మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఆలాగే అక్కినేని నాగార్జున ఒక ఎయిర్పోర్ట్లో ఉండగా ఓ పెద్దాయన దగ్గరకి వచ్చారు. అది గమనించిన బౌన్సర్ ఆ పెద్దాయనను తోయగా కింద పడిపోబోయారు. ఇది అంతా గమనించని నాగార్జున యదావిధిగా అక్కడ నుండి వెళ్లిపోయారు. కానీ ఇది అంత ఓ కెమెరా కంట పడటంతో ఆ వవీడియో వైరల్ అయ్యి నాగార్జున దృష్టిని పడింది. ఆ విధంగా జరిగిన విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే తన సోషల్ మీడియా ప్లాట్ఫారం అయినా X ద్వారా ఆయనకు క్షమాపనలు తెలిపారు. ఆ విష్యం అప్పుడే తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను అని నాగార్జున తెలిపారు.