Akkineni: చైతూ అంటూ న‌దిలో దూకిన ఫ్యాన్‌.. ఇలాంటి పిచ్చి ప‌నులు వ‌ద్దంటూ క్లాస్!

Akkineni: అక్కినేని నాగ‌చైత‌న్య.. అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడిగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై త‌న‌కంటూ ప్రేక్ష‌కుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. చైతూ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. మ‌నం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న థ్యాంక్యూ చిత్రంలో చైతూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రుగుతుంది.. దీంతో త‌మ అభిమాన న‌టుడు చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌డంతో పెద్ద సంఖ్య‌లో Akkineniఅక్కినేని అభిమానులు చేరుకున్నారు. దీంతో అక్క‌డికి వ‌చ్చిన నాగ‌చైత‌న్య వారంద‌రితో క‌లిసి ఫోటోలు దిగారు.. అయితే ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా.. న‌దిలో నాగచైత‌న్య ప‌డ‌వ ప్ర‌యాణం చేస్తుంటాడు.. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌నే ఉన్న ఓ అక్కినేని డైహార్డ్ ఫ్యాన్ ఏకంగా Akkineniనాగ‌చైత‌న్య కోసం న‌దిలో దూకేశాడు.

Nagachaithanaya

దీంతో చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లో అభిమాని న‌దిలో దూకేయ‌డంతో షూటింగ్‌కు అంత‌రాయం క‌లిగింది.. వెంట‌నే డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ప్యాక‌ప్ చెప్పాడు. అనంత‌రం చైతు ఆ అభిమానిని పిలిచి ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి ప‌నులు చెయ్యొద్ద‌ని చెప్పి.. కాసేపు స‌ర‌దాగా అభిమానితో ముచ్చ‌టించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక చైతూ న‌టించిన‌ ల‌వ్‌స్టోరి సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.. ఇందులో Akkineni చైతూకు జోడీగా సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.