నిహారిక అతడితో వెళ్లిపోగానే సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా

త్వరలో మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె జీ తెలుగులో బాపు బొమ్మకు పెళ్ళంటా అనే స్పెషల్ ప్రోగ్రామ్ కి వచ్చింది. అందులో నగబాబుతో పాటు అనసూయ, అదిరింది కమెడియన్స్ అలాగే ఇతర సీరియల్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అయితే అందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగబాబు తన కూతురి వల్ల ఒకానొక సందర్భంలో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట. ఆ విషయాన్ని వివరిస్తూ.. కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ కి వెళ్లినప్పుడు అక్కడ ఒక నల్లకోటు వేసుకున్న వ్యక్తిని చూసిన నిహారిక అతనే నాన్నా అనుకోని వెళ్లిపోయింది. మేము చుట్టూ పక్కల టెన్షన్ పడుతు వెతికాము. అప్పుడు చాలా భయం వేసింది. ఆ దేశంలో ఉన్నవాళ్ళని చంపేయాలని అనిపించింది. నేను నా కుటుంబ సభ్యులం కూడా చనిపోవాలని అనుకున్నాం. ఎందుకంటే నా కూతురు అంటే నాకు అంత ఇష్టం. తనే నానా జీవితం. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు అని నాగబాబు వివరణ ఇచ్చారు.