సింగ‌ర్ సునీత‌కు విషేస్ తెలిపిన నాగ‌బాబు!

ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత, మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీర‌ప‌నేనిల వివాహం ఇటీవ‌లే జ‌రిగిన విష‌యం తెలిసిందే. శంషాబాద్ స‌మీపంలోని అమ్మ‌ప‌ల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆల‌యంలో వీరి వివాహం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల‌కు చెందిన వాళ్ల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజరై నూత‌న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

nagababu

తాజాగా మెగా బ్ర‌ద‌ర్‌ నాగ‌బాబు వీరిద్ద‌రికి వెరైటీగా విషేస్ తెలిపారు. ఆనందం అనేది పుట్టుక‌తో రాద‌ని, దానిని మ‌నం వెతికి అందుకోవాలని నాగ‌బాబు ట్వీట్ చేశారు. రామ్‌, సునీత త‌మ సంతోషాల‌ను అన్వేషించి గుర్తించినందుకు అభినంద‌న‌లు చెబుతున్నాన‌ని అన్నారు. జీవితంలో ధైర్యంగా ముందడుగు వేయాల‌నుకునేవారికి వారి జంట ఆద‌ర్శంగా నిలిచింద‌ని పేర్కోన్నారు. ప్రేమ‌, ఆనందం అనేవి ఎప్ప‌టికీ వారి శాశ్వ‌త చిరునామాగా మారాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలుపుతూ.. వారికి వివాహ శుభాకాంక్ష‌లు అని త‌న ట్విట్ట‌ర్ ద్వారా నాగ‌బాబు తెలిపారు.