Bollywood: బాలీవుడ్ పై క‌న్నేసిన అక్కినేని హీరో..

Bollywood: టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య అక్కినేని బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌డానికి స‌న్నాద్ధం అవుతున్నాడు. అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న లాల్ సింగ్ చ‌ద్దా చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం చైతూను అడిగార‌ట చిత్ర‌బృందం. దీనికి చైతూ ఓకే చెప్పాడ‌ని స‌మాచారం.

nagachaithanya

హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫారెస్ట్ గంప్‌కి రీమేక్‌గా లాల్ సింగ్ చ‌ద్దా చిత్రం రూపొందుతుంది. మొద‌ట్లో కీల‌క పాత్ర కోసం విజ‌య్ సేతుప‌తిని అనుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పాడు విజ‌య్ సేతుప‌తి. ఈ చిత్రాన్ని అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో.. అమీర్‌ఖాన్ ప్రొడ‌క్ష‌న్‌లో ఈ Bollywood చిత్రం రూపుదిద్దుకుంటుంది.