నాగ చైతన్య కూడా వరుసగా కొత్త ప్రాజెక్టులను ఎనౌన్స్ చేస్తూ ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అతని తదుపరి చిత్రం లవ్ స్టోరీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అతను థాంక్స్ అనే సినిమాకు సంతకం చేసాడు. ఈ చిత్రం డిసెంబర్ నుండి ప్రారంభమవుతుంది. చైతన్య ఇంకా కొన్ని ప్రాజెక్టుల కోసం పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ప్రముఖ నటుడు అర్జున్ నాగ చైతన్యకు స్క్రిప్ట్ వివరించాడని అందుకు ఆమోదం కూడా పొందాడట. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇది ఒకే షెడ్యూల్ లో చిత్రీకరించబడుతుందట. తుది కాల్ తీసుకోవడానికి అర్జున్ పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని చైతన్య కోరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. ఒక విదంగా అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున కంటే కూడా నాగ చైతన్య చాలా వేగంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని చెప్పవచ్చు.