ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా నభ నటేష్ ను ఎంపిక చేశారు నిర్మాతలు.. ప్రస్తుతం హైదరాబాద్ లో శెరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.. రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ చిత్రం లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
నటీనటులు : రామ్ పోతినేని, నిధి అగర్వాల్,నభ నటేష్, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి..
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
సమర్పణ: లావణ్య
బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్
ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి
పాటల రచయిత: భాస్కరభట్ల
ఫైట్స్ : రియల్ సతీష్
P.R.O : వంశీ – శేఖర్