హిస్టరీ క్రియేట్ చేసిన RRR… ‘నాటు నాటు’

అందరూ ఎదురు చూసిన కల నేరవేరింది. యావత్ దేశం సంతోషంతో పులకరించి పోయింది. అందరి ఆశలను మోసుకుంటూ లాస్ ఏంజిల్స్‌లో అడుగు పెట్టిన RRR.. ఆస్కార్ విజేత‌గా నిలిచింది. నాటు నాటు పాట‌ను ఆస్కార్ అవార్డ్ వ‌రించింది. ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో నాటు నాటుకి ఈ అవార్డు రావ‌టంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది. దీనిపై యావత్ తెలుగు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. RRR టీమ్‌కి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అభినందనలను తెలియజేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ కూడా ఆర్ఆర్ఆర్ కావటమే విశేషం.

95వ అకాడమీ అవార్డ్స్‌లో ఒరిజినల్ సాంగ్ కేటగరిలో 81 సాంగ్స్ పోటీ పడ్డాయి. అందులో 15 సాంగ్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యాయి. అందులో నుంచి 5 సాంగ్స్‌ని నామినేట్ చేశారు.