
సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శ్రీమతి శశి వంటిపల్లి నిర్మాతగా ఆమని, వికాస్వ వశిష్ట, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదీని తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవి కుమార్, భీమ్ సాంబ సినిమాటోగ్రాఫర్ గా వినోద్ కుమార్ విన్ను సంగీత దర్శకుడిగా పనిచేస్తూ ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తె….
కథ:
ఓ రాజకీయనాయకుడు కొడుకు తన స్నేహితుడితో కలిసి ఒక అమ్మాయి పై హత్యాచారం చేస్తారు. ఈ కేసు విషయంలో లాయర్ కచ్చితంగా నిందితులకు శిక్ష పడాలి అని రాజకీయనాయకులు ఎంత బయటపెట్టిన లొంగకుండా ముందుకు వెళ్తుంది. ఈ ప్రయాణంలో సమాజంలో ఆడవాళ్ళు జీవితానికి అద్దం పట్టేలా ఉంటుంది. తన తండ్రి ఇష్టం లేని పెళ్లి చేయడానికి ప్రయత్నించగా ఆమె తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అయితె ఈ క్రమంలో ఏం జరుగుతాయి. ఎవరు తప్పు చేసిన వదలకుండా ఎటువంటి చర్యలు చేస్తారు అనేది తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన ఆమని గారు తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు. అలాగె నాగ మహేష్, ప్రగతి తమ పాత్రలకు న్యాయం చేస్తూ సినిమాకు మంచి ప్లస్ గా నిలిచారు. అలాగే ఇతరు పాత్రలు చేసిన వారంతా తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్ గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ:
ఈ సినిమా ముఖ్యంగా కథను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకుడు ఎటువంటి అడుగు వేశారో చూడాలి. ఒక కొత్త రకం కథను తీసుకుని తన మేకింగ్ స్టైల్ లో ప్రేక్షకులకు చాల దగ్గరగా తీసుకుని వెళ్లేలా దర్శకత్వం వహించారు. మంచి నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ చూస్తే దర్శకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో అర్థం అవుతుంది. నటీనటుల నుండి సాంకేతిక బృందం వరకు ప్రతి ఒక్కరినీ పూర్తిగా వాడుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రాఫర్ చిత్రాన్ని తన కెమెరాలో బంధించి తెర పైకి తీసుకుని రావడం లో సక్సెస్ అయ్యారు. ఆర్ పి పట్నాయక్, రమణ గోగుల, సునీత తదితర వాయిస్ పాటలకు మంచి ప్లస్ గా నిలిచాయి. సినిమాలోని సిట్యువేషన్ కు తగ్గట్లు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
ప్లస్ పాయింట్స్:
కథ, నటీనటుల నటన, సంగీతం, పాటలు
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొంచం స్లోగా ఉండటం
సారాంశం:
సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులు హక్కును చేర్చుకునే విధంగా నారి సినిమా ఉంది.