Allari Naresh: “నాంది” నుంచి మ‌రో సాంగ్ రిలీజ్‌..

Allari Naresh: అల్ల‌రి చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ఇంటిపేరునే అల్లరిగా మార్చుకున్న న‌టుడు న‌రేశ్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కుల్లో ఆయ‌న ఈ పేరుతో ఎంతో గుర్తింపు ‌సంపాదించుకున్నాడు‌. ఇన్నాళ్లు త‌న కామెడీ పంథాలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌గా.. ఈ సారి త‌న రూటు మార్చుకుని ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించ‌డానికి సిద్ధం అయ్యాడుAllari Naresh. ఆయ‌న నుంచి వ‌స్తున్న తాజా చిత్రం నాంది. ఈ చిత్రంలో న‌రేశ్ వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లో కనిపించ‌నున్నాడు.

allari naresh movie

ఈ చిత్రానికి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట‌ర్‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దేవ‌త‌లంతా అనే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించ‌గా.. కిట్టు విస్సా ప్ర‌గ‌డ లిరిక్స్ అందించ‌గా.. ఈ చిత్రానికి శ్రీ‌చ‌ర‌ణ్ స్వ‌రాలు అందించారు. ఇక ఈ చిత్రంలో త‌మిళ ప్ర‌ముఖ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ లాయ‌ర్ పాత్రను పోషిస్తుంది. అలాగే Allari Nareshఈ చిత్రంలో హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీన్‌, దేవి ప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.